కరవుపై చర్చించని మంత్రివర్గ సమావేశమెందుకు? తప్పుడు కేసుల్లో ఇరికించడంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు: నారా లోకేశ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 5:18 PM IST

Nara Lokesh Comments on AP Cabinet Meeting: రైతులను కరవుకు వదిలేసిన కర్కశ ప్రభుత్వం.. కరవుపై చర్చించని క్యాబినెట్ మీటింగ్.. ఎందుకని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో కరవు కారణంగా పనుల్లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. వందేళ్లలో ఈ ఏడాదే అతి తక్కువ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్​కు రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడంపై ఉన్న శ్రద్ధ కరవుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడంపై లేదని విమర్శించారు. 

అడ్డగోలు దోపిడీపై తప్ప కరవు నివారణ చర్యలు చేపట్టాలన్న సోయలేదని లోకేశ్ దుయ్యబట్టారు. తీవ్ర కరవు పరిస్థితుల్లో రైతులు ఉంటే.. వారి సమస్యలపై క్యాబినెట్ సమావేశంలో కనీసం చర్చించకపోవడం జగన్ ప్రభుత్వానికి అన్నదాతల సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిద‌ర్శనమన్నారు. వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌పై ప్రభుత్వం కనీసం సమీక్ష చేయకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. 400 మండలాల్లో కరవు పరిస్థితులు ఉంటే కేవలం 100 మండలాల్లో కరవు అని ప్రభుత్వం ప్రకటించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌రవు కోర‌ల్లో చిక్కి రైతులు విల‌విల్లాడుతున్న ఈ కష్టకాలంలో నిబంధనలను సడలించి అయినా యుద్ధప్రాతిపదికన రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని లోకేశ్ డిమాండ్‌ చేశారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.