Nara Lokesh CID Investigation Today: అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో విచారణకు హాజరైన నారా లోకేశ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 9:53 AM IST

Updated : Oct 10, 2023, 10:58 AM IST

Nara Lokesh CID Investigation Today: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో (Amaravati Inner Ring Road case) కోర్టు ఉత్తర్వులు మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. అయిదు నిమిషాలు ముందే సీఐడీ కార్యాలయానికి లోకేశ్ చేరుకున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ లోకేశ్​కు సీఐడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లోకేశ్ ఈ నెల 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం సీఐడీకి పలు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయంలో ఈ మేరకు విచారణ జరగనుంది. విచారణ సమయంలో లోకేశ్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 లోపు మాత్రమే విచారించాలని.. మధ్యాహ్నం ఓ గంట భోజన విరామం ఇవ్వాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశించింది. హెరిటేజ్ సంస్థకు లబ్ధిచేకూరేలా ఇన్నర్ రింగ్​ రోడ్డు ఎలైన్మెంట్ మార్చారని సీఐడీ అభియోగాలు మోపింది. లేని, వేయని, కనీసం భూసేకరణ కూడా చేయని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి ఎలా సాధ్యమని తెలుగుదేశం నిలదీస్తోంది. రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర విభజనకు ముందు హెరిటేజ్ సంస్థ కేవలం 9 ఎకరాల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటే అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది.

Last Updated : Oct 10, 2023, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.