వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌కు చేదు అనుభవం.. జై బాలయ్య అంటూ! అభిమానుల హంగామా! - Nandamuri Balakrishna fans news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18128297-1002-18128297-1680194948262.jpg)
Jai Balayya slogans: అధికార వైసీపీ నేతల ముందు బాలకృష్ణ అభిమానులు హంగామా చేశారు. బహుమతులు ఇవ్వడానికి వచ్చిన వారి ముందు జై బాలయ్య అంటూ కేకలు వేశారు. అధికార వైసీపీ నాయకులు, పోలీసులు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా.. యువకులు ఏమాత్రం తగ్గలేదు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన వైసీపీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజ పట్టణంలోని సుగురు ఆంజనేయ స్వామి ఆలయంలో ఉట్టి కొట్టే పోటీల్లో విజేతలకు బహుమతులు ఇచ్చేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న యువత జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు, వైసీపీ నేతలు వారించేందుకు ప్రయత్నించగా.... రెట్టింపు ఉత్సాహంతో నినాదాలు చేశారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్సీ ఇక్బాల్, ఇంద్రజ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.