Nakka Ananda Babu on YCP Leaders Anarchy: టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతల కోసం ప్రత్యేక జైలు: నక్కా ఆనంద్‌బాబు - who lost their lives due to Chandrababu arrest
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2023, 8:18 PM IST
Nakka Ananda Babu on YCP Leaders Anarchy: వైసీపీ నేతలు చేసిన అరాచకాలపై టీడీపీ అధికారంలోకి రాగానే విచారణ చేపడతామని వారిని లోపల వేసేందుకు ప్రత్యేక జైలు నిర్మిస్తామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు చెప్పారు. చంద్రబాబుని ముద్దాయిగా చిత్రీకరించాలనే ఆయనను అక్రమంగా అరెస్టు చేసి అన్యాయంగా జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై బెంగతో ప్రాణాలు కోల్పోయిన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకి చెందిన వేమూరి కోటయ్య మృతదేహానికి నక్కా ఆనందబాబు నివాళులర్పించి.. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. అంతే కాకుండా వారి కుటుంబానికి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబును అరెస్టు చేసి ప్రజలను ఎందో క్షోభకు గురిచేసారని.. ప్రజలను ఇలా చేసిన మిమ్మల్ని అంత తేలికగా వదలేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టుతో ప్రజలు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారని నక్కా ఆనంద్ బాబు చెప్పారు.