ETV Bharat / state

శివభక్తులకు శుభవార్త -శైవ క్షేత్రాలకు 3,500 ప్రత్యేక బస్సులు - SPECIAL BUSES FOR MAHA SHIVARATRI

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖమైన 99 శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

apsrtc_special_buses_for_maha_shivaratri
apsrtc_special_buses_for_maha_shivaratri (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 11:55 AM IST

APSRTC Special Buses For Maha Shivaratri : మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖమైన 99 శైవ క్షేత్రాలకు భక్తులు వెళ్లి వచ్చేందుకు వీలుగా 3,500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. అత్యధికంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో 12 క్షేత్రాలకు, నెల్లూరు జిల్లాలోని 9 క్షేత్రాలకు, తిరుపతి జిల్లాలో 9 క్షేత్రాలకు, నంద్యాల జిల్లాలో 7 క్షేత్రాలకు బస్సులు తిప్పనున్నట్లు పేర్కొంది. శ్రీసత్యసాయి జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అలాగే అన్ని డిపోలు, ముఖ్య పట్టణాల నుంచి శ్రీశైలానికి బస్సులు వెళ్తాయని చెప్పింది. మొత్తంగా ఈ ప్రత్యేక బస్సుల ద్వారా రూ.11 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసింది.

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి వేడుకలు - శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు

శివునిలో సగం - అవనిలో సగం - ఆకట్టుకునేలా సైకత శిల్పం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.