AP COMMON ENTRANCE EXAMS SCHEDULE: ఏపీలో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి (Andhra Pradesh State Council of Higher Education) ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో షేర్ చేశారు.
వివిధ కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలు పరిశీలిస్తే:
- ఏపీ ఆర్‌సెట్ (పీహెచ్‌డీ) - మే 2వ తేదీ నుంచి 5 వరకూ జరగనుంది.
- ఏపీ ఈసెట్ (డిప్లొమా విద్యార్థులు ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి) - మే 6వ తేదీన
- ఏపీ ఐసెట్ (ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు) - మే 7వ తేదీన జరగనుంది.
- ఏపీ ఈఏపీ సెట్ (అగ్రి, ఫార్మా విద్యార్ధులకు) - మే 19, 20వ తేదీల్లో జరగనుంది.
- ఏపీ ఈఏపీ సెట్ (ఇంజనీరింగ్ విద్యార్ధులకు) - మే 21 నుంచి 27వ తేదీ వరకూ నిర్వహించనున్నారు.
- ఏపీ లాసెట్ - మే 25వ తేదీన జరగనుంది.
- ఏపీ పీజీఈసెట్ (ఎంటెక్, ఎంఫార్మసీ విద్యార్ధులకు) - జూన్ 5 నుంచి 7వ తేదీ వరకూ జరగనున్నాయి.
- ఏపీ ఎడ్‌సెట్ (బీఈడీ అభ్యర్ధులకు) - జూన్ 8వ తేదీన జరగనుంది.
- ఏపీ పీజీ సెట్ (ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ తదితర విభాగాల విద్యార్ధులకు) - జూన్ 9 నుంచి 13వ తేదీ వరకూ నిర్వహించనున్నారు.
- ఏపీ పీఈసెట్ - జూన్ 25వ తేదీన జరగనుంది.
![Common Entrance Exams Schedule](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23540690_common_entrance_exams_schedule.jpg)
ఏకాగ్రతతో పరీక్షలకు బాగా సిద్ధంకండి: వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్'లో షేర్ చేశారు. ప్రవేశ పరీక్షలకు పోటీపడే విద్యార్థులంతా ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగాల్సిన తరుణం వచ్చిందన్నారు. ఉన్నత విద్యామండలి వివిధ పోటీ పరీక్షలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల షెడ్యూల్‌ని ప్రకటించినందున ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. విద్యార్ధులు పరీక్షలకు బాగా సిద్ధమై భవిష్యత్ ప్రయాణంలో అంతా గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.
వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు - ఇలా డౌన్లోడ్ చేసుకోండి