Auto Limit Lifted in Vizag And Vijayawada: విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఆటో రిక్షాల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్ 6, సీఎన్జీ, పెట్రోల్, ఎల్పీజీ, ఈవీ ఆటోల సంఖ్యపై పరిమితిని ఎత్తివేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రజా రవాణాలో భాగంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో విజయవాడ నగరంలో 8700 ఆటో రిక్షాలు, విశాఖలో 8400 ఆటో రిక్షాలకు మాత్రమే అనుమతి ఉండేది.
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సహా ఆటో రిక్షాలు పర్యావరణ అనుకూలంగా ఉండటం, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న నేపథ్యంలో పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అడ్రెస్ మార్పిడి, ఓనర్ షిప్ బదిలీ చేసుకున్న పాత ఆటోలను మాత్రం విజయవాడ, విశాఖ నగరాల్లోకి అనుమతించబోమని రవాణాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
108 వాహన సేవలు దూరం - డయాలసిస్ రోగులకు కష్టం
'కాస్త అప్గ్రేడ్ చేయండయ్యా' - వాహన యజమానులకు చుక్కలు చూపిస్తోన్న పరివాహన్