అవినీతిని ప్రశ్నిస్తే జగన్ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది: నాదెండ్ల మనోహర్‌ - Janasena PAC Chairman Nadendla Manohar comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 9:03 PM IST

Nadendla Manohar Fire on YCP Government: అవినీతిని ప్రశ్నిస్తే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని.. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు నేరుగా, పారదర్శకంగా రాష్ట్ర ప్రజలకు అందాలనే తాము పోరాటం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాలవెల్లువ పథకం.. పాపాల వెల్లువగా మారిందనేది ముమ్మాటికి నిజమని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Nadendla Manohar Comments: పాలవెల్లువ పథకానికి సంబంధించి వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలపై నాదెండ్ల మనోహర్‌ ఘాటుగా స్పందించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..''వైసీపీ ప్రభుత్వ అవినీతిని జనసేన ఆధారాలతో సహా ఎండగడుతుంటే, ఆ పార్టీ మంత్రులు అసత్యాలతో ఎదురుదాడి చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి పాలవెల్లువ పథకం అమలు చేస్తుంటే.. రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎందుకు పెరగడం లేదు..?. పాలవెల్లువ పథకంలో వేల కోట్ల అవినీతి జరిగింది. ఆ డబ్బు ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో చెప్పాలి. నవంబర్ 14 నుంచి రోజూ.. వైసీపీ చేస్తున్న అవినీతి స్కాముల గురించి బయటపెడతాము. వైసీపీ నేతలు, అమూల్ డెయిరీ కోసమే పాల వెల్లువ పథకాన్ని అమలు చేశారు.'' అని ఆయన అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.