Four Wild Cat Cubs Found at Aagiripalli- Hanuman Junction Main Road : ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామ సమీపంలో ఆగిరిపల్లి - హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారి పక్కన గురువారం 4 అడవి పిల్లి కూనలు కనిపించాయి. తొలుత అవి పులి కూనలు అని ప్రచారం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. మర్రెడ్డి ఫణీంద్ర అనే రైతు ఉదయం పొలానికి వెళ్లి పొదల్లో ఉన్న కూనలను చూశారు. పులి కూనలుగా భావించి స్థానికులకు తెలిపారు.
దీంతో పెద్దఎత్తున ప్రజలు అక్కడికి వెళ్లి, వాటిని ఫొటోలు తీసి, పులి పిల్లలంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. విషయం తెలిసి అటవీ శాఖ అధికారులు వచ్చి వాటిని అడవి పిల్లి కూనలుగా తేల్చి, స్వాధీనం చేసుకున్నారు. వాటిని తల్లి వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తామని నూజివీడు ఫారెస్ట్ రేంజర్ టి.సత్యనారాయణ, ఫారెస్ట్ సెక్షన్ అధికారిణి ఎల్.బాల తెలిపారు.
హమ్మయ్యా అవి పులి పిల్లల కాదు- ఊపిరి పీల్చుకున్న రైతులు
"బరి తెగించారు" ఆన్లైన్లో అటవీ జంతువులు అమ్మకం - ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులో బేరాలు