'ఇచ్చిన హామీలను జగన్‌ మరిచారు' - ఈనెల 26 నుంచి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 6:23 PM IST

thumbnail

Municipal Workers Rally to Solve Problems: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నందిగామ మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం గాంధీ సెంటర్లో సీఐటీయూ నాయకులు, మున్సిపల్ కార్మికులు సర్కిల్​గా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎన్​సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 26 నుంచి మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, నెలకు 26 వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమ్మె కొనసాగుతుందని చెప్పారు. వెంటనే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.