MP Avinash reddy mother ఆందోళనకరంగానే అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం.. ఐసీయూ అబ్జర్వేషన్లో ఉందని వైద్యుల ప్రకటన
🎬 Watch Now: Feature Video
MP YS Avinash Reddy Mother Health Bulletin: కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి యాంజియోగ్రామ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను ఈనెల 19న కర్నూలు తరలించారు. నరాల్లో రెండు బ్లాకులు గుర్తించామని, ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని హృద్రోగ వైద్యులు డాక్టర్ హితేష్ రెడ్డి తెలిపారు. ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టామని, బీపీ తక్కువగా ఉందని వైద్యులు వివరించారు.
సీబీఐ నోటీసులు: ఈనెల 16న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ముందస్తు కార్యక్రమాలను కారణంగా హైదరాబాద్ నుంచి కడప వెళ్లిపోయారు. ఈ నెల 19న సీబీఐ హాజరు కావడానికి బయలుదేరిన ఆయన.. చివరి నిమిషంలో తన తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం బాగాలేదంటూ పులివెందుల వెళ్లిపోయారు. తన తల్లికి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల విచారణకు రాలేనంటూ... సీబీఐకి న్యాయవాది ద్వారా సమాచారం పంపించారు. ప్రస్తుతం ఆరోగ్యం బాలేని తన తల్లితో ఉన్న అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ స్పష్టం చేసింది.