MLC Bhumireddy Ramgopal Reddy fires on AP government : 'లోకేశ్‌ను కూడా అరెస్టు చేసేందుకు కుట్ర.. వైసీపీ అక్రమాలపై ప్రత్యక్ష కార్యాచరణ' - ap politics latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 12:15 PM IST
MLC Bhumireddy Ramgopal Reddy fires on AP government : స్కిల్ డెవలప్ మెంట్ (AP Skill development) లో అవినీతి జరగలేదని.. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న స్కిల్ కేంద్రంలోనే కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలు ఉన్నాయని వివరించారు. లోకేశ్‌ను కూడా అరెస్టు చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. పులివెందులలో పాపాఘ్ని నదిలోని ఇసుక అక్రమ రవాణా ద్వారా వైసీపీ నాయకులు 50 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. గత కొంత కాలంగా పులివెందుల నియోజకవర్గంలో ఇసుక అక్రమార్కుల అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయిందని రాంగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా ఇసుక అక్రమాలపై, ఇసుక స్మగ్లర్లపై అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు అన్నారు. ఇక్కడ ప్రతి రోజు నుంచి చెన్నై, కర్ణాటక, బెంగళూరుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు తెలుగు దేశం పార్టీ స్వీకారం చుడుతుంది అన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఇసుక అక్రమాలు అడ్డుకట్టవేయలేకపోయారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు ఒక సారి ఆలోచించాలి అన్నారు.