జగన్ హయాంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు ఎవరూ సంతోషంగా లేరు: ఎమ్మెల్సీ అశోక్​బాబు - ఏపీ రాజకీయ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 8:05 PM IST

MLC Ashok Babu Fire on CM Jagan: రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు ఎవరూ సంతోషంగా లేరని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్​బాబు ఆరోపించారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వచ్చే పరిస్థితి లేదని, పీఆర్​సీ బకాయిలకు దిక్కే లేదన్నారు. మూడు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కనీసం ఇప్పటినుంచైనా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వగలరా అని జగన్ సర్కారుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగుల పీఆర్సీ అరియర్స్‌కు దిక్కులేదని అన్నారు. రెండు డీఏ అరియర్స్ పెండింగ్‌లో పెట్టారని నాడు ఉద్యోగులు చంద్రబాబు కాదనుకున్నారన్న ఆయన, 2018 జూలై1వ తేదీ నుంచి నేటి వరకు 284 డీఏ అరియర్స్‌ కిస్తీలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 

"రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు ఎవరూ సంతోషంగా లేరు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వచ్చే పరిస్థితి లేదు. పీఆర్​సీ బకాయిలకు దిక్కే లేదు. మూడు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కనీసం ఇప్పటినుంచైనా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వగలరా? రెండు డీఏ అరియర్స్ పెండింగ్‌లో పెట్టారని నాడు ఉద్యోగులు చంద్రబాబు కాదనుకున్నారు. మరి ఇప్పుడు వైఎస్సార్సీపీ హయాంలో 2018 జూలై1వ తేదీ నుంచి నేటి వరకు 284 డీఏ అరియర్స్‌ కిస్తీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల మూడు నెలల్లోనైనా ఉద్యోగులకు 1వ తారీఖున జగన్ రెడ్డి జీతాలు ఇవ్వగలడా?" - పరుచూరి అశోక్​బాబు, ఎమ్మెల్సీ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.