ETV Bharat / state

హెచ్‌ఎంపీవీపై అప్రమత్తంగా ఉందాం - ప్రజలు శుభ్రత పాటించాలని చంద్రబాబు సూచన - CHANDRABABU ON HMPV CASES

హెచ్ఎంపీవీ వైరస్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ - అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ అధికారులకు సీఎం ఆదేశం

Chandrababu on HMPV Cases
Chandrababu on HMPV Cases (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2025, 7:11 AM IST

Chandrababu on HMPV Cases : దేశంలో హెచ్‌ఎంపీవీ కేసుల నమోదైన వేళ రాష్ట్రంలోనూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గుజరాత్, కర్ణాటకల్లో కేసులు నమోదైనందున అలర్ట్​గా ఉండాలని చెప్పారు. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి అంశంపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో ఈ కేసులు పెరగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

హెచ్‌ఎంపీవీ వైరస్ అంత ప్రమాదకరం కాదన్న అధికారులు 2001 నుంచి ఈ వైరస్ ఉందని ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటి వరకూ ఒక్క కేసూ నమోదు కాలేదని వివరించారు. అయినా ఆక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాంటి శ్వాసకోస వ్యాధులు, ఇన్ ఫ్లూయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తత అవసరమని చంద్రబాబు సూచించారు. మైక్రోబయాలజిస్ట్‌లు, పీడియాట్రీషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్‌ఫోర్సు కమిటీ నియమించి వారి సలహాలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్‌లను సిద్ధం చేయాలని టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసుకోవాలని సూచనలు చేశారు. తక్షణం 3000ల టెస్టింగ్ కిట్లను తెప్పించుకోవాలని ఆదేశాలిచ్చారు. ఔషధాల లభ్యతపైనా ముఖ్యమంత్రి ఆరా తీశారు.

HMPV Virus Cases : రాష్ట్రంలో 4.5 లక్షల ఎన్95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు , 3.52 లక్షల పీపీఈ కిట్లు ఉన్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటి సరఫరాను పెంచాలన్న సీఎం శానిటైజర్లనూ సిద్ధం చేయాలని సూచించారు. హెచ్ఎంపీవీ వైరస్ చికిత్సకు వినియోగించే రిబావిరిన్ ఔషధాన్ని కొనుగోలు చేయాలని, ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేసేంతవరకూ స్థానికంగా తెప్పించుకోవాలని చెప్పారు. చిన్నారులు, రోగనిరోధకశక్తి తక్కువ ఉండే రోగులకు హెచ్​ఎంపీవీ ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు.

బోధనాసుపత్రుల్లో 20 పడకల ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తున్నట్టు అధికారులు చంద్రబాబుకు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఓపీ వద్ద శానిటైజర్ డిస్పెన్సింగ్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆక్సిజన్ సరఫరా, లిక్విడ్ ఆక్సిజన్ సప్లై, పైపులైన్లకు సంబంధించి ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలన్న సీఎం ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని స్పష్టం చేశారు. హెచ్​ఎంపీవీ వైరస్ వ్యాప్తి దృష్ట్యా శుభ్రత పాటించాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు. కనీసం 20 సెకన్లపాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఏపీలో హెచ్‌ఎంపీవీ కేసులేవీ నమోదు కాలేదు - ప్రజలు భయపడొద్దు: మంత్రి సత్యకుమార్

రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఉన్నాయా? - వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.