Pawan Kalyan Responded to BJP Victory in Delhi Elections: దిల్లీ ఎన్నికల విజయంతో ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం మరోసారి రుజువైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై పవన్ స్పందించారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. మోదీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో దిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అమిత్‌షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయని పవన్ కల్యాణ్ ప్రశంసించారు.
మంత్రి నారా లోకేశ్ అభినందనలు: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీకి మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ దూరదృష్టి నాయకత్వంలో, దిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్‌పై విశ్వాసం వ్యక్తం చేశారని అన్నారు. దేశ రాజధాని వికసిత్ భారత్ మార్గంలో కొనసాగుతుందన్న భరోసా ఇచ్చారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, అందరి ఉజ్వల భవిష్యత్తుకు ప్రాధాన్యతనిచ్చే ఎన్డీయే పాలనపై ఉన్న నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని చెప్పారు. దిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కొత్త ప్రభుత్వం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు.
'దిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్' - ఏపీలో బీజేపీ నేతల సంబరాలు
ఈనెల 10న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం