MLA Mustafa Daughter Attend The Official Meeting : అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె.. వెల్లువెత్తున్న విమర్శలు.. - guntur politics
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 8:40 AM IST
MLA Mustafa Daughter Attend The Official Meeting : గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా హాజరు కావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులతో మేయర్ కావటి మనోహర్ నాయుడు నిర్వహించిన సమావేశంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ప్రస్తుతం వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె అధికారిక సమావేశంలో పాల్గొన్నారు. ఏ హోదాతో ఆమె సమీక్ష సమావేశానికి హాజరయ్యారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆమె వైసీపీ తరఫున గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పనులపై మేయర్ నిర్వహించిన సమీక్షలో నూరి ఫాతిమా పాల్గొన్నారని మేయర్ కార్యాలయ సిబ్బంది ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ప్రజా ప్రతినిధి కాకుండానే సమావేశంలో పాల్గొన అధికారులకు ఎలా ఆదేశాలు ఇచ్చారని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎమ్మెల్యే ముస్తఫా తన కుమార్తే వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధిగా ప్రకటించారు. రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా యాక్టివ్ అయ్యారు. తండ్రితో పాటుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు.