WOMENS FIRE ON MLA: "ఎమ్మెల్యే గారూ..! పథకాలు లేకున్నా పర్వాలేదు.. మద్యాన్ని నిషేధించండి" - ఎమ్మెల్యే మేకపాటి నిరసన సెగ
🎬 Watch Now: Feature Video

WOMENS FIRE ON MLA MEKAPATI : నెల్లూరు మర్రిపాడు మండలం ఖాన్ సాహెబ్ పేటలో గడపగడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేయగా.. మహిళల నుంచి ఊహించని స్పందన ఎదురైంది. మహిళలు తమ సమస్యలపై గళమెత్తారు. తమ ప్రాంతంలో బెల్టుషాపులు తొలగించాలని ఖాన్‌సాహెబ్‌పేట మహిళలు అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు.. మద్యాన్ని నిషేధించాలాంటు ఎమ్మెల్యే ముందు వారి గోడు వెళ్లబోసుకున్నారు. ఇది తమ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య అని మహిళలు అన్నారు. డిసిపల్లి ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా తీసుకుని వచ్చి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని వాటిని అరికట్టాలని మహిళలు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వీధి దీపాలు, సరైన రోడ్లు, మంచి నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు ఎమ్మెల్యే ఎదుట అసహనం వ్యక్తం చేశారు.