Mla Kotam Reddy on Prasad scheme: నరసింహకొండ ఆలయానికి ప్రసాదం పథకం.. కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కోటం రెడ్డి - Narasimhakonda temple

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 4:08 PM IST

Mla Kotam Reddy on Prasad scheme: నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ ఆలయం నరసింహకొండ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం.. ప్రసాదం పథకం కింద ఎంపిక చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశంలో తెలిపారు. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, కలెక్టర్ చక్రధర్ బాబుకు తీసుకున్న చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు నరసింహకొండను అభివృద్ధి చేయాలని గతంలో కేంద్రాన్ని కోరానని, ఆమేరకు ప్రసాదం పథకం కింద అభివృద్ధికి ఎంపిక చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఇక్కడ కొనేర్లు, గిరిప్రదక్షిణ చేసే ప్రాంత అభివృద్ధి, దశావతారాల వృద్ధి జరుగుతుందని తెలిపారు. దీంతో పాటు నాలుగేళ్లుగా పోరాటంచేస్తున్న మరిన్ని ఆలయాల అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా గణేష్ ఘాట్, ఇరుకళల పరమేశ్వరి ఆలయం, భారా షాహిద్ దర్గా అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ స్కీం కింద 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.