MLA Kotam Reddy in Rottela Panduga: 2024లో చంద్రబాబు సీఎం కావాలి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక రొట్టె - బారాషాహీద్ దర్గాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
Mla Kotam Reddy In Nellore Rottela Panduga: నెల్లూరు బారా షాహీద్ దర్గాలో నాలుగో రోజు జరుగుతున్న రొట్టెల పండగకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి.. దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తయారు చేయించిన 24 కిలోల ప్రత్యేక రొట్టెను ఎమ్మెల్యే కోటంరెడ్డి స్వర్ణాల చెరువులో పట్టుకున్నారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, ప్రజలందరూ బాగుండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఇలా ఇరవై నాలుగు కోరికలతో ప్రత్యేకంగా ఆ రొట్టెను తయారు చేసినట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. బారా షాహీద్ దర్గా అభివృద్ధికి నిధులు మంజూరు చేయించానని ఆయన తెలిపారు. ఆనం వివేకానంద రెడ్డి, వెంకయ్య నాయుడు ఇలా చాలా మంది ఈ దర్గా అభివృద్ధికి కోసం కృషి చేశారని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగిపోయిన దర్గా అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్, వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఆయన కోరారు.