పెనుకొండ సీటు శంకరనారాయణకే ఇవ్వాలి - ఉష శ్రీచరణ్‌పై ఎంపీపీ ఘాటు వ్యాఖ్యలు - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 4:47 PM IST

Minister Usha Sree Charan Contest From Penukonda: సామాజిక న్యాయంలో భాగంగా తాను పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్నారని అన్నారు. సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఈ సారి తాను పెనుకొండ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని అధిష్టానం చెప్పినట్లు ఆమె తెలిపారు. సీఎం జగన్ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయటానికి సీట్ల సర్దుబాటు చేస్తున్నారని మంత్రి చెప్పారు. కళ్యాణదుర్గం నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలైనందున అక్కడి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఉష శ్రీచరణ్ అన్నారు.

YCP Leaders Protest Against Minister Usha Sri Charan: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి ఉష శ్రీచరణ్​ను అధిష్టానం నియమించడంతో నియోజకవర్గ వైసీపీ నాయకులలో అలజడి మొదలైంది. ఉషశ్రీకి వ్యతిరేకంగా రొద్దం మండలం ఎంపీపీ చంద్రశేఖర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు ఆందోళన చేశారు. పెనుకొండ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా శంకరనారాయణను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్​పై ఎంపీపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.