జగన్‌కు వ్యతిరేకంగా సొంతవాళ్లు పని చేసినా ప్రతిపక్షంగానే చూస్తాం: మంత్రి పెద్దిరెడ్డి - YS Sharmila news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 3:48 PM IST

Minister Peddireddy Reaction on YS Sharmila Joining Congress Party: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అని కాదు, తమ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసినా వారిని ప్రతిపక్షంగానే చూస్తామని ఆయన అన్నారు. 'మా కాళ్లు మేమే నరక్కునే పరిస్థితి' వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.  

Peddireddy Fire on MLA MS Babu: చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌. బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీగా గెలవలేని ఎం.ఎస్‌. బాబును తాము ఎమ్మెల్యేగా చేశామని గుర్తు చేశారు. ''ఎవరో రెచ్చగొట్టే మాటలు విని ఎం.ఎస్‌.బాబు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అలా విమర్శలు చేయడం చాలా బాధాకరం. ఆత్మ విమర్శ చేసుకుని బాబు వైసీపీకి పని చేయాలి. కాంగ్రెస్ పార్టీ అని కాదు. మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా మేము ప్రతిపక్షంగానే చూస్తాం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినంత మాత్రాన మా కాళ్లు మేమే నరుక్కుంటామా ? మా కాళ్లు మేమే నరక్కునే పరిస్థితిలో మా పార్టీ లేదు'' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.