పోలీస్‌స్టేషన్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత - వైఎస్సార్సీపీ నేత విడుదల - స్టేషన్​లో వైసీపీ నేతలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 12:05 PM IST

Midnight Tension at Narasa Raopet Rural Police Station : పల్నాడు జిల్లా నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ కార్యాలయంలో గొడవ చేశారని ఆ పార్టీ అసమ్మతి నేత గజ్జల బ్రహ్మారెడ్డి అనుచరుడు సయ్యద్ హుస్సేన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుస్సేన్​ను విడిచి పెట్టాలంటూ స్టేషన్ ఎదుట బ్రహ్మారెడ్డి, ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఐతే అదే సమయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గీయులు స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇరు వర్గాలు రోడ్డుపై బాహాబాహికి దిగారు. వారికి పోలీసులు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. 

YSRCP Leaders Fight in Palnadu District : కొద్ది సేపటి తర్వాత గజ్జల బ్రహ్మారెడ్డి, ఆయన అనుచరులు మళ్లీ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో హుస్సేన్​ను పోలీసులు విడిచి పెట్టారు. సీఐ కృష్ణయ్య తనను అగౌర్వ పరిచే పదజాలాలు వాడి కించపరిచే విధంగా మాట్లాడారని గజ్జల బ్రహ్మారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తన అనుచరులను పోలీసులు కొట్టారని బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.