కర్రపై కర్ర పెట్టి, వంతెన కట్టి - గుండెను చేత పట్టి, ఒడ్డుకు చేరుతున్న ప్రజలు! జగనన్న కొంచం చూడన్న - ఏపీలో వరదలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 3:19 PM IST

Michaung Cyclone in Titupati District : తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం వద్ద భారీ వరద ప్రవాహంతో రహాదారి కొట్టుకుపోవటంతో రాకపోకలకు స్థానికులు అవస్థలు పడుతున్నారు. పులికాట్ సరస్సులో ప్రవాహం పెరిగి కొరికాడు, ఏలికాడు, మీజూరు పరిసర గ్రామాల రహదారి కొట్టుకుపోయిందని స్థానికులు తెలిపారు. రాకపోకలు సాగించేందుకు స్థానికులు కర్రలతో వంతెన ఏర్పాటు చేసుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. తుపాను ప్రభావానికి రోడ్డు కొట్టుకుపోయినా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Pulicat Lake Cut Off In tirupati : మిగ్​జాం తుపాను కారణం చిన్న వాగుల నుంచి పెద్ద పెద్ద నదుల వరకు అన్నింటికీ వంతెనలు తెగిపోయాయి. కొన్ని ప్రాంతాలలో నీరు ఇళ్లలోకి చేరి ఊర్లే చెరువులను తలపించిన ఘటనలు లేకపోలేదు. తుపాను, భారీ వర్షాల వల్ల పులికాట్ సరస్సులో ప్రవాహం పెరిగింది. కొరికాడు, ఏలికాడు, మీజూరు చుట్టు పక్కల గ్రామాల రోడ్డు తెగి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం స్థానికులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.