Mango Farmers: అకాల వర్షాలు.. అల్లాడిపోతున్న మామిడి రైతులు - Mango Farmers
🎬 Watch Now: Feature Video
Mango Farmers: అకాల వర్షాలతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో కన్నీరు పెడుతున్నారు. గాలివాన వల్ల మామిడి కాయలు రాలిపోయాయని.. ఇప్పుడు వాటిని కొనడానికి ఎవరు ముందుకు రారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదంటూ వాపోతున్నారు.
అకాల వర్షాలతో మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మామిడి పూత బాగా వచ్చింది.. ఈసారి దిగుబడి బాగుంటుందని తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. కానీ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాలి తోడవ్వడంతో మామిడి కాయలు రాలిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలేదని వాపోతున్నారు. ఎకరం మామిడి తోటకు దాదాపు 30 నుంచి 50 వేల రుపాయల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు. మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో తాము పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదో అర్ధం కావడం లేదని రైతులు తెలిపారు. ఇప్పటికే అప్పుల పాలైన తమని... ప్రభుత్వమే ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.