Lokesh Praises Female VRO: 'విధి నిర్వహణలో మీనా నిబద్ధతకు వందనాలు' - అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలు సీజ్
🎬 Watch Now: Feature Video
Lokesh praises the female VRO: మట్టి అక్రమ దందాపై సమాచారం వచ్చిన వెంటనే విధి నిర్వహణలో ఉన్న ఆ అధికారికి ఉష్ణోగ్రత, ఎండ వేడిమి.. ఎలాంటి ఆటంకం కాలేదు. ముందూ వెనుకా చూడకుండా వెంటపడి ద్విచక్ర వాహనంపై వెళ్లి అడ్డగించింది వీఆర్ఓ మీనా. పది నెలల పసిగుడ్డుతో ఇంతటి ధైర్య సాహసాలను చూపిన మీనాను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. కృష్ణాజిల్లా పామర్రు మండలం, పసుమర్రు పరిధిలో ఇసుక బట్టీలకు అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకుని సీజ్ చేసిన వీఆర్ఓ మీనాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. విధి నిర్వహణలో మీనా నిబద్ధతకు వందనాలు తెలిపారు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు ఆమె చర్య ఆదర్శం కావాలని లోకేశ్ ఆకాంక్షించారు. సోదరి ధైర్య సాహసాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. అధికారుల్లో ఎంతో మంది జగన్ రెడ్డికి భయపడి ఇసుక, మట్టి, మైనింగ్ లాంటి అనేక మాఫియాలకు సహకరిస్తుంటే.. ఒక మహిళ చేతిలో 10 నెలల చంటి బిడ్డను పెట్టుకుని బైక్ మీద వెళ్లి మండుటెండలో మాఫియాను అడ్డుకోవడం మాటలు కాదని లోకేశ్ కొనియాడారు.