Locals Protest Against MLA: గడగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ.. రోడ్డుపై బైఠాయించిన మహిళలు - ap news
🎬 Watch Now: Feature Video
Locals Protest Against Katasani Rambhupal Reddy: నంద్యాల జిల్లా పాణ్యం మండలం భూపనపాడు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బీసీ కాలనీలోకి వెళ్లిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ నెరవేర్చలేదంటూ రహదారిపై బైఠాయించారు. కాలువలు, రహదారులు వేయిస్తామన్నారని.. వర్షం పడితే ఇళ్లలోకి బురద చేరుతుందని వాపోయారు.
రహదారులన్నీ బురదమయం అవ్వడంతో.. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని.. హామీలను నెరవేర్చాలంటూ నిలదీశారు. ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ తమ కాలనీకి ఏం చేశారని స్థానిక మహిళలు ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే.. మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్థానిక నాయకులు మహిళలకు నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
ఎమ్మెల్యేను స్థానికులు నిలదీసిన వీడియోలను.. అతని అనుచరులు, పోలీసులు.. డిలీట్ చేశారు. సెల్ ఫోన్లను లాక్కోవడానికి వచ్చిన ఎమ్మెల్యే అనుచరులపై.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సమస్యను ఎమ్మెల్యేకు చెబుతుంటే మీరెవరు వీడియోలను డిలీట్ చేయడానికి అంటూ వారిపై తిరగబడ్డారు.