శ్రీశైలంలో చిరుత పులి మృతి - ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఎలుగుబంటి - Leopard died near Srisailam Maha Kshetra
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 12:39 PM IST
Leopard Died in Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రం సమీపంలోని హఠకేశ్వర వద్ద చిరుత పులి మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి చిరుతను ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో చిరుత పులి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకొని సున్నిపెంట రేంజ్ అధికారి కార్యాలయానికి తరలించారు. చిరుత మృతికి కారణమైన వాహనాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు.
Bear Hit Bike in Eguva Ahobilam : జిల్లాలోని ఎగువ అహోబిలం రహదారిపై ఎలుగుబంటి ద్విచక్రవాహనాన్ని కొట్టింది. చాగలమర్రి మండలం పెద్ద వంగలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పావన నృసింహస్వామి ఆలయానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. అడవిలో నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా అడ్డు వచ్చి వాహనాన్ని ఢీ కొట్టింది. అదుపు తప్పి కిందపడటంతో ఇరువురికి గాయాలయ్యాయి. ఎలుగుబంటి వారిపై దాడి చేయకుండా అడవిలోకి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వారిని దిగువ అహోబిలానికి తరలించి చికిత్స అందించారు.