కంపెనీ వ్యర్థాలతో చెరువులో చేపలు మృతి - న్యాయం చేయాలని సీఐటీయూ డిమాండ్ - Fish Died in Anakapally negligence of pharma
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2023, 1:05 PM IST
Large Amount Of Fish Died Due in Anakapally: రాంకీ ఫార్మా కంపెనీ నిర్లక్ష్యం వల్ల చెరువులోకి కాలుష్య వ్యర్థాలు చేరి భారీ స్థాయిలో చేపలు మృత్యువాత పడడంపై సీఐటీయూ(CITU) నేత గనిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. ఫార్మా కంపెనీ నుంచి వెలువడిన వ్యర్థాలు చెరువులో చేరడం వల్లే మత్స్య సంపద నాశనం అయిందన్నారు. ఈ కంపెనీకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సత్యనారాయణ ఆరోపించారు.
Ramki Pharma Company Released Wastages Into Pond: అనకాపల్లి జిల్లా పరవాడ గ్రామంలో రాంకీ యాజమాన్యం నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీ కాలుష్య వ్యర్ధాలు చెరువులోకి విడుదల అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రతి సంవత్సరం చేపలు మృత్యువాత పడుతున్నాయని, ఫార్మా కంపెనీ యాజమాన్యాలను, అధికారులను కలిసి ఈ సమస్య గురించి విన్నపించుకున్నా ఎలాంటి పరిష్కారం చూపడం లేదని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఈ సమస్యపై అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి వినతి పత్రం కూడా ఇచ్చామని అయినా ఈ సమస్యపై ఎటువంటి పరిష్కారం లభించలేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పరవాడ గ్రామానికి విచ్చేసిన గనిశెట్టి మాట్లాడుతూ ఫార్మాకంపెనీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు కావడం వల్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ, భూగర్భ జలాలను నాశనం చేస్తున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంకీ యాజమాన్యంపై పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ అన్నారు.
TAGGED:
పరవాడ గ్రామంలో చేపలు మృతి