Nallamala Ghat Road: నల్లమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. నిలిచిపోయిన వాహనాలు - nallamala Forest
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-07-2023/640-480-19100013-658-19100013-1690358193678.jpg)
Landslides on Nallamala Ghat Road: రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల జన జీవనం స్తంభించిపోయింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు- దోర్నాల మధ్య నల్లమల.. ఘాట్రోడ్లో అర్ధరాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండచరియలతో పాటు వాన ధాటికి ఘాట్రోడ్లో చెట్లు కూడా రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో అటుగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి జరగటంతో.. అప్పటి నుంచి తెల్లవారుజాము వరకు వాహనాలు, ప్రయాణికులు వాటిని తొలగించలేక అక్కడే ఉండిపోయారు. కొండచరియలు విరిగిపడిన సమయంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. రోడ్డు ఇలా దిగ్బంధంలోకి మారటంతో అటుగా వచ్చిన వాహనదారులు అవస్థలు ఎదుర్కొన్నారు. కొండచరియలు పడటం, రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడి నిలిచిపోయిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. స్థానికులు, ప్రయాణికుల సాయంతో రోడ్డుకు అడ్డుపడిన చెట్లను తొలగించారు. దీంతో వాహనాలు అక్కడి నుంచి ముందుకు కదిలాయి. అనంతరం వాహనాల రాకపోకలను పోలీసులు పునరుద్దరించారు.