Kuruba Community Rally for CBN: బాబుకు మద్దతుగా కనగానపల్లిలో ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు.. సర్దిచెప్పిన టీడీపీ నేతలు - శ్రీసత్యసాయి జిల్లా తాాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 4:55 PM IST

Kuruba Community Rally for CBN: శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మద్దతుగా కురబ సామాజికవర్గం చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. స్కిల్​ డెవలప్​మెంట్ కేసులో చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా.. ఆయనకు సంఘీభావం తెలుపుతూ కురబ సామాజికవర్గం శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది. దీంతో మండలంలోని కురబలంతా కనగానపల్లి చేరుకున్నారు.

తెలుగుదేశం నేతలు  పార్థసారథి, పరిటాల సునీత, శ్రీరామ్​లు ఈ ర్యాలీలో పాల్గొని.. వారికి తమ మద్దతు తెలిపారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలంటూ.. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీ చేపట్టారు. శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన వారిని.. పోలీసులు అడ్డుకోగా.. కురబ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్ పోలీసులకు నచ్చచెప్పి ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా వైయస్సార్​ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలికిపాటు రాజకీయాలు మానుకోవాలని.. టీడీపీ నేతలు హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.