కృష్ణా తరంగ్ 2023 యువజనోత్సవాలకు ఏర్పాట్లు - 2వేల మంది విద్యార్థుల రాక - కృష్ణా యూనివర్సిటీలో యువజనోత్సవాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 2:28 PM IST
Krishna University Youth Festivals In Vijayawada: విజయవాడలో కృష్ణా యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నవంబరు 30, డిసెంబర్ 1,2 తేదీల్లో కృష్ణా తరంగ్-2023 పేరుతో యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి కె.జ్ఞానమణి తెలిపారు. ఈ యువజనోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు మాట్లాడారు. యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించే యువజనోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని జ్ఞానమణి మీడియాకు వెల్లడించారు.
27 అంశాలతో జరిగే పోటీల్లో విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల తరపున 1500 నుంచి 2000 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. యువజనోత్సవాల్లో పాల్గొనే విద్యార్థులు అందరికీ అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇతర కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు, అధ్యాపకులు ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాటలు, నృత్య ప్రదర్శనలు వివిధ రకాల క్రీడలతో అలరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య బ్రహ్మచారి, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.