Kotamreddy on Tollgate టోల్‌గేట్‌ను రద్దు చేసినట్లు ఎంపీ ఆదాల ప్రకటించారు.. మరి ఈ పనులేంటీ?: కోటంరెడ్డి - ఆదాల ప్రభాకర్ రెడ్డిపై కొటంరెడ్డి వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
Kotamreddy Protest at Tollgate Construction Site : నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై టోల్ గేట్ నిర్మాణ స్థలం వద్ద రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన చేపట్టారు. నిర్మాణ పనుల కోసం తీసిన గుంటలను ఎమ్మెల్యే పరిశీలించి, టోల్ గేట్‌ను అడ్డుకుంటామని ప్రకటించారు. పది రోజుల క్రితం పనులు ప్రారంభమైతే టోల్ గేట్ రద్దు చేసినట్లు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో టోల్ గేట్ ప్రతిపాదనలో వస్తే తాము ఆందోళన చేపట్టి అడ్డుకున్నామన్నారు. మరళా మూడేళ్ల క్రితం నిర్మాణ పనులు మొదలు పెట్టాలని చూస్తే అధికారులతో మాట్లాడి నిలిపివేశామని చెప్పారు. తాజాగా పనులు ప్రారంభించడంతో రాజకీయాలకతీతంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తే, విజయ్ సాయి రెడ్డితో మాట్లాడి మే నెలలోనే టోల్ గేట్‌ను ఆపేశామని ఎంపీ ఆదాల చెప్పటం హాస్యాస్పదమన్నారు. ప్రజలను మోసగించేందుకే ఆదాల పచ్చి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.
గత నెలలో పనులు ప్రారంభిస్తే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. జిల్లా మంత్రి కాకాణి, ఎంపీ అద్దాల పనులను అడ్డుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. నగర పరిధిలో టోల్ గేట్ వస్తే ట్రాఫిక్ సమస్య తీవ్రం అవుతుందని, ప్రమాదాలు పెరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టోల్ గేట్ నిర్మాణాన్ని ఆపకుంటే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామని ఆయన ప్రకటించారు.