MLA follower Murder: వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు దారుణ హత్య.. అదే కారణమా..! - AP Latest News
🎬 Watch Now: Feature Video
Kodumuru MLA Sudhakar follower Murder: కర్నూలు జిల్లాలోని ఎదురూరు గ్రామంలో అధికార పార్టీకి చెందిన కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని ఈడిగ రామాంజనేయులు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. మృతుడు ఈడిగ రామాంజనేయులు కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్‌తో సన్నిహితంగా ఉంటూ.. ఎమ్మెల్యేకు సంబంధించిన పనులు చెస్తూ ఉంటాడని సమాచారం. అనుచరుడు హత్యకు గురైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో చర్చించి.. మృతదేహాన్ని పరిశీలించారు. హత్యపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. మృతుని కుటుంబానికి ధైర్య చెప్పి తమకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. హత్య చేసిన ప్రత్యర్ధులు కూడా వైసీపీ పార్టీకి చెందిన వారేనని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.