'నాగార్జునసాగర్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదు' - బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 30, 2023, 7:49 PM IST
|Updated : Nov 30, 2023, 7:57 PM IST
Kishan Reddy on Telugu State Governments : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. నాగార్జున సాగర్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదని.. అనుమతి లేకుండా గేట్లు ఎత్తి నీరు తీసుకెళ్లడం మంచి సంప్రదాయం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు. ఏపీకి తాగునీరిచ్చేందుకు అభ్యంతరం లేదన్న కేంద్రమంత్రి.. చర్చల ద్వారా ఇరు రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన అనంతరం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
Kishan Reddy Latest Comments : ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్, వైయస్ఆర్సీపీ కలిసి ఉద్రిక్తత పరిస్థితులు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నకలవేళ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు పంచాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా సాగాయని.. పోలింగ్లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొని.. విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు.