Kidnapping Of Young Man In Chirala Of Bapatla District: పోలీసులం అని చెప్పి ఇంట్లోకి వచ్చారు.. యువకుడిని పట్టుకుపోయారు - Kidnapping Of Young Man In Bapatla District
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 5:09 PM IST
Kidnapping Of Young Man In Chirala Of Bapatla District: ఓ ముగ్గురు వ్యక్తులు తెనాలి పోలీసులమంటూ ఇంట్లోకి ప్రవేశించి.. యువకుడిని కిడ్నాప్ చేసిన సంఘటన బాపట్ల జిల్లా చీరాలలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీరాల పట్టణంలోని బంధవారి వీధిలో నివాసముంటున్న రవితేజను శుక్రవారం ఓ ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయన్న వన్ టౌన్ పోలీసులు.. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆ ముగ్గురు వ్యక్తులు పోలీసులా..? కాదా..? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బాధితుడి (రవితేజ) తల్లి లక్ష్మి మాట్లాడుతూ..''నా కుమారుడు రవితేజ కోసం ముగ్గురు వ్యక్తులు ఇంటికొచ్చి ఆరా తీశారు. దాంతో నేను ఇంటి లోపల ఉన్న మా అబ్బాయిని పిలవగా.. వారు ఒక్కసారిగా మా కుమారుడిపై దాడి చేసి, కారు వద్దకు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకువెళ్తున్నారని నేను ప్రశ్నించాను. అందుకు వారు తెనాలి పోలీసులమంటూ దురుసుగా ప్రవర్తించారు. నా కొడుకును నా కళ్లముందే కొట్టుకుంటూ కారులో ఎత్తుకుపోయారు. పోలీసులు, ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయండి.'' అని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.