మైనర్ బాలికపై గుర్తు తెలియని వ్యక్తుల కిరోసిన్ దాడి - చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ - ఇద్దరు సభ్యులు మైనర్‌పై కిరోసిన్‌తో దాడి
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2023, 9:45 PM IST
Kerosene Attack on Girl in Velerupadu : ఏలూరు జిల్లా వెలేరుపాడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక శరీరం 60 శాతం వరకూ కాలిపోయిందని వైద్యులు తెలిపారు.
Two members Attack on Minor Girl With Kerosene in Eluru District : ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి (Eluru SP Mary Prasanthi) వెంటనే స్పందించి హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి చేరుకున్నారు. బాధిత బాలిక పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనకు గల కారణం గురించి తెలుసుకొనుటకు ప్రయత్నం చేయగా ఆమె ఏ విధమైన సమాచారం చెప్పలేని స్థితిలో ఉందని, బాధితురాలి నుంచి ఘటనకు గల కారణాలు సేకరించిన అనంతరం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వేలేరుపాడులో క్షేత్రస్థాయిలో ఘటనకు సంబంధించిన విషయాల గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు.