డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్రప్రదేశ్: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 8:15 PM IST
|Updated : Nov 1, 2023, 8:42 PM IST
KCR ON AP ROADS : ఏపీ రోడ్ల దుస్థితిపై పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ... సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. విద్యుత్ సరఫరా తీరుపైనా తనదైన శైలిలో విమర్శలు చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఏపీ రోడ్లు, తెలంగాణ రోడ్లను చూసి బేరీజు వేసుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ఇక్కడ వెలుగులు - అక్కడ చీకట్లు.. తెలంగాణ వస్తే.. ఎలా బతుకుతారని ఏపీ నేతలు మాట్లాడారన్న కేసీఆర్.. ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో.. తెలంగాణలో ఎలా ఉన్నాయో చూడాలని అన్నారు. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ.. సింగిల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అని విమర్శించారు. సరిహద్దుల్లోని ఏపీ ప్రజలు తెలంగాణకు వచ్చి వరి ధాన్యం అమ్ముకుంటున్నారని తెలిపారు. ఇవాళ తెలంగాణలో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతుంటే.. ఏపీలో చీకట్లు కమ్ముకుంటున్నాయని కేసీఆర్ చెప్పారు.