వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు - ధ్వజారోహణంతో అంగరంగ వైభవం బ్రహ్మోత్సవాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 7:05 PM IST

Kartika Brahmotsavam of Sri Padmavati Goddess : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నుల పండుగా జరిగే అమ్మవారి ఉత్సవాలు.. మొదటిరోజు ధనుర్ లగ్నంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ఈ ఘట్టం మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సకల దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు. 

సువర్ణ లోకం, భూలోకం , పాతాళ నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయటంతో ధ్వజారోహణ పర్వం ముగిసింది. ఈ వేడుకల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం తదితరులు పాల్లొన్నారు. రాత్రికి చిన్న శేషవాహన సేవలు ప్రారంభమవుతాయి. నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.