Kapu Leaders Fires on CM jagan: 'కాపు రిజర్వేషన్ అడ్డుకుంది జగన్మోహన్రెడ్డి కాదా?..టీడీపీ, జనసేన పొత్తును స్వాగతిస్తున్నాం..'
🎬 Watch Now: Feature Video
Kapu Leaders Fires on CM jagan: ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే కాపులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి.. తమకు అన్యాయం చేశారని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాపు కార్పొరేషన్ కు రూ. 2వేల కోట్లు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ నిధులు ఇవ్వకపోయినా... కనీసం నోరు తెరిచి మాట్లాడలేని స్థితిలో వైసీపీలోని కాపు నాయకులు ఉన్నారని అమరావతి కాపునాడు అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో రాధా, రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
టీడీపీ, జనసేన పొత్తును తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ రిజర్వేషన్ను అడ్డుకుంది జగన్మోహన్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. విజయవాడకు రంగా పేరు పెట్టాలని రాష్ట్రవ్యాప్తంగా సంతకాలు సేకరించి ఇచ్చినా విస్మరించింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా అని శ్రీనివాసరావు నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని తెలిసి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.