Kanna Comments on Chandrababu Arrest: అక్రమ కేసులు పెట్టడంలో వైసీపీ ప్రభుత్వం గిన్నీస్‌ బుక్‌ రికార్డ్‌: కన్నా - Chandrababu arrested

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2023, 11:30 AM IST

Kanna Lakshminarayana Comments on Chandrababu Arrest: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం అంటూ వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  2021లో ఎఫ్​ఐఆర్​(FIR)లో కూడా చంద్రబాబు పేరు లేదని ఇప్పుడు రిమాండ్‌ రిపోర్టులో (Remand Report) మళ్లీ చంద్రబాబు పేరు చేర్చారని మండిపడ్డారు. కేవలం ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించడం సీఎం జగన్‌ నైజమని ధ్వజమెత్తారు. ప్రజా కోర్టులో వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో సీఐడీ స్వామి భక్తిని నిరూపించుకుంటుందని కన్నా (Kanna Lakshminarayana fire on CID) ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండ్‌ రిపోర్టులో సరైన ఆధారాలు పొందుపరచకుండా చంద్రబాబుని ఉగ్రవాదిలా వందల మంది పోలీసులతో అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై కన్నా లక్ష్మీనారాయణతో ముఖామఖీ 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.