Kandula Durgesh on TDP and JSP Alliance టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీలో వణుకు పుడుతోంది : జనసేన నేత కందుల దుర్గేష్ - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2023, 10:53 AM IST
Kandula Durgesh Comments on TDP and JSP Alliance : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు చారిత్రక అవసరమని తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. దుర్గేష్రాజమహేంద్రవరంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. జనసేన, టీడీపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని పవన్‌కల్యాణ్ ప్రకటించిన దగ్గర నుంచి వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు కేవలం కక్ష సాధింపు చర్యే అని దుర్గేష్ మండిపడ్డారు. ప్రభుత్వంలోని ఉండే అన్ని విభాగాలు మీ చేతుల్లో ఉంటాయి కదా.. చంద్రబాబు నాయుడు ప్యాకేజీ తీసుకున్నారని ఒక్క ఆధారం ఉంటే చూపించాలి అని అన్నారు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదుని, కనీసం ఇప్పటికీ కూడా ప్రాథమిక ఆధారలను కూడా చూపించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.