Kakinada Arudra met Chandrababu: పిచ్చివాళ్లమని ముద్ర వేశారు.. చంద్రబాబు ఎదుట కాకినాడ ఆరుద్ర ఆవేదన
🎬 Watch Now: Feature Video
Kakinada Arudra Meet Chandrababu Naidu: అధికారపార్టీకి చెందిన నేతలు తమ కుటుంబంపై పిచ్చివాళ్లమనే ముద్ర వేసి నరకం చూపిస్తున్నారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వద్ద.. కాకినాడకు చెందిన మహిళ ఆరుద్ర కన్నీరు మున్నీరుగా విలపించారు. కుమార్తె వైద్యం కోసం పోరాడుతున్న తమను ఆదుకోవాల్సింది పోయి.. ఆస్తులనూ అమ్ముకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చినా న్యాయం జరగలేదన్నారు. దాడిశెట్టి రాజా, కుడిపూడి సూర్యనారాయణలతో తన కుటుంబానికి ప్రాణహానీ ఉందని, పోలీసులు అర్థరాత్రులు ఇంటికి వచ్చి వేధిస్తున్నారని చంద్రబాబు ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఆమెను ఓదార్చిన చంద్రబాబు.. పార్టీపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆరుద్ర కుటుంబానికి భద్రత కల్పించే చర్యలు తీసుకుంటానని ధైర్యం చెప్పారు. గత కొంతకాలంగా కన్నబిడ్డ ఆరోగ్యం కోసం ఆరుద్ర పోరాడుతున్నారు. కుమార్తెకు వైద్యం చేయించాలనే తాపత్రయంతో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గతంలో ఆరుద్ర ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అనేక సార్లు అధికారులు చుట్టూ తిరిగినా.. ఆరుద్రకు న్యాయం జరగలేదు.