KA Paul Hunger Strike at Steel Plant in Visakhapatnam: విశాఖ స్టీల్‌కు న్యాయం జరగాలంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: కేఏ పాల్ - steel plant latest updates
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 7:43 PM IST
KA Paul Hunger Strike at Steel Plant in Visakhapatnam: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసే వరకు దీక్ష కొనసాగిస్తామని కేఏ పాల్ చెప్పారు. కేంద్రం నుంచి కూడా అతి త్వరలోనే మంచి శుభవార్త ఉంటుందని కేఏ పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్నఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కేఏ పాల్‌కు ప్రజల నుంచి రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. అతి త్వరలోనే కేంద్రం నుంచి మంచి శుభవార్త ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన దీక్ష కోసం కేంద్రంలోని పలువురు మంత్రులు.. ఫోన్లో మాట్లాడినట్లు కేఏ పాల్ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో సత్వర న్యాయం జరగాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేయాలని పాల్ సూచించారు. ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసినప్పుడే.. కేంద్రం చర్యలు తీసుకుంటుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తామని కేంద్రం అధికారికంగా ప్రకటించే వరకు దీక్ష కొనసాగిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.