వైసీపీ జెండాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన - పరిస్థితి ఉద్రిక్తం - అనంతపురం జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 9:07 PM IST
JC Prabhakar Reddy Agitation on YSRCP Flag Issue: తాడిపత్రి పట్ణణంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారీ తీసింది. స్థానికంగా ఏర్పాటు చేసిన వైసీపీ జెండాలను పోలీసులు తేసేస్తామని హామీ ఇచ్చి తీయకపోవడంపై ఆయన ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా, పోలీసులకు ప్రభాకర్ రెడ్డికి మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.
తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకులు నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర సందర్భంగా పలు చోట్ల పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ జెండాలు విద్యుత్ దీపాలకు అడ్డుగా ఉన్నాయని, ప్రభాకర్ రెడ్డి తొలగించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అప్పుడు పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు జేసీని అడ్డుకున్నారు. రెండు రోజుల్లో అడ్డుగా ఉన్న జెండాలను తొలగిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. పోలీసులు ఇచ్చిన హామీ గడువు రెండు రోజులు దాటిపోయిందని, జెండాలను తొలగించలేదని ఆయన బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ప్రభాకర్ రెడ్డిని జీపులో ఎక్కించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. జేసీ ప్రతిఘటించడంతో పోలీసులు శ్రమించి జీపులో ఎక్కించి ఆయన ఇంటికి తరలించారు.