Jada Sravan Padayatra: తుళ్లూరు నుంచి మొదలైన జడ శ్రావణ్ పాదయాత్ర... - నేటి వార్తలు
🎬 Watch Now: Feature Video
Jai Bheem Bharat Party: అమరావతిలో ఆర్5 జోన్‌ను వ్యతిరేకిస్తూ... జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ కోసం విజయవాడ నుంచి బయలుదేరి అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి పాదయాత్రను ప్రారంభించారు. తుళ్లూరు నుంచి స్మృతివనం వరకూ పాదయాత్ర జరగనుంది. అమరావతిని శ్మశానం అన్న వైఎస్సార్సీపీ నాయకులు ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఎలా ఇస్తున్నారని జడ శ్రావణ్ ప్రశ్నించారు. అమరావతిని ముఖ్యమంత్రి జగన్‌తో సహా రాష్ట్ర మంత్రులు గతంలో విమర్శించారని జడ శ్రావణ్ దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మద్దత్తుగా తన పాదయాత్ర జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రైతులు, అమరావతి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గతంలో జడ శ్రావణ్ పాదయాత్రకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో... జై భీమ్ భారత్ పార్టీకి చెందిన నేతలు హెకోర్టుకు వెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. హైకోర్టు షరతులతో కూడిన అనుమతులను ఇచ్చింది.