Animal Festival in Tirupati District : సంక్రాంతి అంటేనే రైతుల పండగ. వారితో పశువులకు ఎనలేని అనుబంధం ఉంటుంది. అందుకే ఈ పండగలో పశువులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పండగ పూట పల్లెల్లో పశువులను ముస్తాబు చేస్తారు. అందులో భాగంగానే ఎడ్లబండ్ల పోటీలు, బండలాగుడు పోటీలు చేపడతారు. ముఖ్యంగా పలుచోట్ల జల్లికట్టు నిర్వహిస్తారు. ఈ పోటీలలో దాదాపుగా అన్ని రైతు కుటుంబాలు పాల్గొంటాయి. అలాగే ఇతర ప్రాంతాల్లోనూ ఉంటున్నవారు ఈ పోటీలలో పాలు పంచుకునేందుకు గ్రామాలకు చేరుకుంటారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్త శానంభట్లలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మెుదలయ్యాయి. ఈ సందర్భంగా గ్రామస్థులంతా కలిసి పశువులు పండగను వైభవంగా నిర్వహించారు. దేవుళ్ల ఫోటోలు, రాజకీయ నాయకులు, సినీ హీరోల చిత్రపటాలు అతికించిన చెక్క పలకలను పశువుల కొమ్ములను అలంకరించి జనం మధ్యలో వదిలారు.
జనాల్లోకి దూసుకొస్తున్న పశువులను నిలువరించేందుకు వాటి కొమ్ములకు ఉన్న చెక్క పలకలను చేజిక్కించుకునేందుకు యువకులు పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో కొందరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో గాయపడ్డ యువకులను చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పశువుల పండగను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
తిరుపతి జిల్లాలో అట్టహాసంగా జల్లికట్టు పోటీలు- కొత్త అనుభూతి కలిగిందన్న యువత
ఈ పండుగను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచే కాక తమిళనాడు, బెంగళూరు రాష్ట్రాల నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పశువుల కొమ్ములకున్న చెక్క పలకలు చేజిక్కించుకున్న యువకులు కేరింతల కొడుతూ ఆనంద ఉత్సాహాల మధ్య పండుగ నిర్వహించారు.
జోర్దార్గా సదర్ సన్నాహాలు - బరిలోకి ఘోలు2 - ఇది ఇంటర్నేషనల్ దున్నపోతు