Celebrities supporting AP Govt Campaign on Social Media: సోషల్ మీడియాను మంచికి వాడుదాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో చేపట్టిన ప్రచార పర్వానికి సినీ నటులు, ప్రముఖులు తమ మద్దతు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపునిచ్చారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై అవగాహన పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో సోషల్ మీడియాపై క్యాంపెయిన్ చేపట్టారు. త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ చేర్చి చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగులు పెట్టారు. 'పోస్ట్ నో ఈవిల్' (POST NO EVIL) పేరుతో ఫోర్త్ మంకీ బొమ్మతో జరుగుతున్న ఈ ప్రచారానికి తాజాగా సినీ నటులు, ప్రముఖులు తోడవుతున్నారు.
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయవద్దు: సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టవద్దని పలువులు ప్రముఖుల ప్రచారం చేస్తున్నారు. అభ్యంతరకర పోస్టులు, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు, సినీ నటుడు తేజ సజ్జా వీడియోలను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేయటం వల్ల జరిగే అనర్థాలపై ప్రజల్ని చైతన్యపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాంపెయిన్‌కు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే సినీ నటులు నిఖిల్, అడవి శేష్, శ్రీలీల తమ మద్దతు తెలిపుతూ వీడియోలు విడుదల చేశారు.
అసభ్యకర పోస్టులు పెట్టేవారు ప్రపంచంలో ఎక్కడున్నా తప్పించుకోలేరు : సీపీ
ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల మనసులు బాధ పడే విధంగా పోస్టులు పెట్టొద్దు. అందులోనూ ప్రత్యేకంగా కుటుంబసభ్యులు, మహిళల గురించి అసభ్యంగా పోస్టులు పెట్టకుండా ఉండాలి.- చాగంటి కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
ఏం కాదులే అని సోషల్ మీడియాలో ఆడపిల్లల పోస్టులకు పెట్టే కామెంట్స్ వాళ్ల మైండ్‌సెట్‌ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా తప్పుడు ప్రచారం చేసినా వాటివల్ల ఎన్నో కుటుంబాలు బాధపడతాయి. ఇకనుంచి సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుందాము. తప్పడు పోస్టులు పెట్టకుండా ఉందాము.- తేజ సజ్జా, సినీ నటుడు
వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - 'పోస్ట్ నో ఈవిల్'పై సినీ స్టార్స్
మూడు కోతులు కాదు-నాలుగోది వచ్చింది! విజయవాడలో ఆకట్టుకుంటున్న ఫ్లెక్లీలు,హోర్డింగ్‌లు