ఆగని వైసీపీ నేతల దాడులు.. తాజాగా మరొకసారి! - MLA Padmavati
🎬 Watch Now: Feature Video
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం గ్రామ పంచాయతీ జన చైతన్య నగర్ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. ఎమ్మెల్యే పద్మావతికి వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించిన టీడీపీ నేతలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు నాలుగేళ్లుగా బిల్లులు మంజూరు కాలేదని.. ఎమ్మెల్యే పద్మావతికి వినతిపత్రం అందజేయడానికి వెళ్తే వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. సమస్య పరిష్కారానికి వినతిపత్రం అందజేయాలని చూస్తే ఎమ్మెల్యే తీసుకోకుండా వెళ్లి పోవడం ఏంటని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. అనంతరం పోలీసులు, ఎమ్మెల్యే వద్దకు టీడీపీ శ్రేణులును తీసుకెళ్లి ఎమ్మెల్యే పద్మావతికి వినతిపత్రం ఇప్పించారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు బాబా ఫక్రుద్దీన్ వలిని అడ్డుకున్నారు.
ఇరు వర్గాల వారికి తోపులాట జరగడంతో టీడీపీ నేత బాబా ఫక్రుద్దీన్ వలి కిందికి పడి పోవటంతో తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెల్లేటానికి వెళ్లిన వారిని అడ్డుకోవటం సబబు కాదని ప్రజలు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.