పోర్టుల భూసేకరణ కోసం పరిశ్రమశాఖ మార్గదర్శకాలు జారీ - ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 10:26 AM IST

Issuance Of Industry Guidelines For Port Based Industries: రాష్ట్రంలో ఉన్న పోర్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలకు భూసేకరణ కోసం పరిశ్రమశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసక్తి ఉన్న భూవిక్రయదారుల నుంచి ఏపీ మారిటైం బోర్డు భూమి కొనుగోలు చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీ మారిటైం బోర్డు (Andhra Pradesh Maritime Board) చట్టం-2019 ప్రకారం పోర్టులను అనుసంధానిస్తూ మౌలిక సదుపాయల కల్పన, పరిశ్రమల ఏర్పాటుకు కార్యచరణ రూపొందించింది. 

రాష్ట్రంలో మూడు పోర్టుల అభివృద్ధి కోసం మూడు ప్రత్యేక వాహక సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టు డెవలప్​మెంట్ కార్పొరేషన్లను (Port Development Corporation) ఏర్పాటు చేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టు ఆధారిత పరిశ్రమలకు భూముల కొనుగోలు కోసం జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు పరిశ్రమశాఖ ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయి భూముల కొనుగోలు కమిటీ నిర్ధారించిన ధరను పరిశీలించి ఆమోదించాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి ఇతర ప్రక్రియలు చేపడతామని పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.