కరవు తాండవం.. పట్టించుకోని పాలకులు.. వలసలే దిక్కు అంటున్న రైతులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 11:40 AM IST
|Updated : Nov 5, 2023, 1:55 PM IST
Irrigation Problems in Prakasam District : ప్రకాశం జిల్లాలో కరవు తాండవిస్తోంది. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల పరిధిలోని అత్యధిక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు సాగుచేసిన రైతులు వర్షాలు కురవక, బోర్లలో చుక్కనీరు రాక అల్లాడిపోతున్నారు. పంటలు పూర్తిగా ఎండిపోయాయని, ఏం చేయాలో దిక్కుతోచడం లేదని ఆవేదన చెందుతున్నారు. నవంబర్ నాటికి కచ్చితంగా వెలిగొండకు నీళ్లిస్తామన్న పాలకులు.. ఇప్పుడు ఆ ఊసే మరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొట్ట చేతబట్టుకుని వలసపోవడం తప్ప మరో మార్గం లేదంటూ రైతులు వాపోతున్నారు.
Farmers Fires on YCP Government Due to Irrigation Problems : ప్రభుత్వం కనీసం కరవు మండలంగా కూడా గుర్తించట్లేదని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం వల్ల తాము మిరప తదితర పంటలు వేసుకున్నామని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కరవు ఇంతకుముందెన్నడబ చూడలేదని అంటున్నారు. వలసలే దిక్కు అన్నట్లు ఉంది మా భవిష్యత్తు అని ఆవేదన చెందుతున్నారు.